గంధం గూడ:వినాయక మండపాల్లో
నిర్వహించిన లడ్డు వేలంపాట

బండ్లగూడ జాగీర్ (హైదరాబాద్), సెప్టెంబర్17 (విశ్వం న్యూస్) : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ గంధం గూడ వేరువేరు వినాయక మండపంలో, శ్రీ వెంకటేశ్వర కాలనీ లడ్డు వేలంపాటలో 1,66,000 రూపాయలకు వెంకటయ్య లడ్డూ కొనుగోలు చేశారు.

విద్యానగర్ గణపతి లడ్డు వేలంపాటలో 1,02,000 రూపాయలకు శ్రీనివాస్ చారి లడ్డూ కొనుగోలు చేశారు.
నార్సింగ్ మాజీ డైరెక్టర్ కట్ట సాయిబాబాగౌడ్ 76,000 రూపాయలకు లడ్డూ కొనుగోలు చేశారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు తలారి ప్రేమ్ కుమార్, కార్పొరేటర్ చంద్రశేఖర్ భోగాల శ్రీనివాస్, కాలనీవాసులు, గ్రామస్తులు, పరిసర కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.