ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

బండ్లగూడ జాగిర్, (విశ్వం న్యూస్) : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గంధంగూడలో శ్రీ సంఘమిత్ర స్కూల్ లో ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తలారి ప్రేమ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఉన్నతమైంది. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో వారి కృషి ఎనలేనిది. నవ సమాజ నిర్మాణానికి గురువులే వారధులు.. అలాంటి గురువులను ప్రతి ఒక్కరూ గౌరవించుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ సుబ్బారెడ్డి మరియు టీచర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *