కౌశిక్ రెడ్డి నియామకం పట్ల హర్షం

కౌశిక్ రెడ్డి నియామకం పట్ల హర్షం

వీణవంక, ఏప్రిల్ 19 ( విశ్వం న్యూస్ ) : హుజురాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జిగా పాడి కౌశిక్ రెడ్డి నియామకం పట్ల చదువు జితేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని, దాని కొనసాగింపు గానే యువకుడు అయినా పాడి కౌశిక్ రెడ్డి ని ప్రభుత్వవిప్, ఎమ్మెల్సీగా నియమించారనీ, పార్టీ కార్యక్రమాలను ప్రజల చేరువకు తీసుకు పోవడానికి కౌశిక్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నాడని, తద్వారా యువతకు పార్టీలో మంచి అవకాశాలు వస్తాయని మాజీ ఉపసర్పంచ్ చదువు జితేందర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు, జిల్లా మంత్రి గంగుల కమలాకర్, జిల్లా అధ్యక్షుడు జివి రావు గార్లకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *