దళిత వాడలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి

దళిత వాడలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి

  • దళిత వాడల్లో కరెంటు బిల్లులు కట్టాలని బిఆర్ఎస్ ప్రభుత్వం వేదించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము : ఎండి సాహెబ్ హుస్సేన్

వీణవంక, ఏప్రిల్ 19 ( విశ్వం న్యూస్ ) : మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దళితులకు ఉచిత విద్యుత్ ఇచ్చాము ఉమ్మడి రాష్ట్రంలో దళితులకు ఉచిత విద్యుత్ సాధ్యమై ప్రస్తుత ధనిక రాష్ట్రంలో దళితులకు ఉచిత విద్యుత్ ఎందుకు సాధ్యం కాదు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలని ఎండి సాహెబ్ హుస్సేన్ డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం రాకముందు మన రాష్ట్రం ఏర్పడితే మన పాలన మనం చేసుకుంటాం అంటే దళితుల మీద దౌర్జన్యం చేయడమేనా దళిత వాడల్లో కరెంటు మీటర్లు లేనప్పుడు వారి మీద విజిలెన్స్ కేసులు ఏ విధంగా పెడతారని అడుగుతున్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే డిస్కములు దళితవాడలో అరాచకం సృష్టిస్తున్నాయి.

తక్షణమే ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన రహస్య ఆదేశాలు ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నాము. భవిష్యత్తులో దళితులపై ఎలాంటి కేసులు పెట్టిన ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుంది గతంలో ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉండాలని కోరుతున్నాము టిఆర్ఎస్ ప్రభుత్వం తన ఏకపక్ష నిర్ణయాన్ని ఉపసంహరించుకొని దళిత వాడలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *