పేదలకు సహాయం అందజేసిన
వాసుదేవ హాస్పిటల్ అధినేత

- పేదలకు సహాయం అందించడంలో ఎప్పుడూ ముందుండే వాసుదేవ హాస్పిటల్-అలయన్స్ క్లబ్స్ డిస్ట్రిక్ట్137/ఏ కరీంనగర్
తిమ్మాపూర్, జూలై 4 (విశ్వం న్యూస్) : పేదవారి జీవన ప్రమాణాలు మెరుగు పర్చే ఉద్దేశ్యంతో సేవా కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం నిరుపేదలకు ఐదు ప్రెషర్ కుక్కర్ లు, గ్యాస్ స్టవ్ లు, ఆర్వో డొమెస్టిక్ వాటర్ ప్యూరిఫయర్ లను వాసుదేవ హాస్పిటల్ అధినేత- అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డా.ఎలగందుల శ్రీనివాస్, గవర్నర్ డా. గాలిపెల్లి నాగేశ్వర్ లు అందించారు.
ఈ కార్య క్రమంలో డా.ఎలగందుల శ్రీనివాస్, ఇంజనీర్ కోల అన్నారెడ్డి, ఈద కుమారస్వామి, గాలి పెల్లి నాగేశ్వర్, ఎలగందుల సౌమ్య-శ్రీదేవి, చీకోటి శ్రీనివాస్ గాంధీ, చెరిమల వెంకటేశ్వర్లు, సాగర్ రెడ్డి, వాసుదేవ హాస్పిటల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.