బోడుప్పల్:శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని
దర్శించుకున్న మంత్రి మల్లారెడ్డి

హైదరాబాద్, జూలై 4 (విశ్వం న్యూస్) : బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని టెలిఫోన్ కాలనీ శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం వార్షికోత్సవం బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని టెలిఫోన్ కాలనీ శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం వార్షికోత్సవం మేయర్ సామల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.

ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి, గౌరవ అతిథులుగా మాజీ జడ్పటిసి సభ్యులు, బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి, కార్పొరేటర్ భూక్య సుమన్ తదితర కార్పొరేటర్లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.