
హైదరాబాద్, జనవరి 19, 2026 (విశ్వం న్యూస్) : ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి వాడుతున్న హౌలా మాటలు, పిచ్చి పిచ్చి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మదంతో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి వెంటనే తన భాష మార్చుకోవాలని హెచ్చరించారు.
బీఆర్ఎస్ గద్దెలను టచ్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, తెలంగాణ ప్రజలే కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతారని హరీష్ రావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి స్థాయికి తగని చౌకబారు మాటలు మానేసి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.
ప్రతిపక్షాన్ని బెదిరించే రాజకీయాలు తెలంగాణలో సాగవని, ఈ పిచ్చి మాటలు కొనసాగితే రేవంత్ రెడ్డి కుర్చీ ఊగడం ఖాయమని హరీష్ రావు హెచ్చరించారు.