ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శనలు
ఆకట్టుకున్న కూచిపూడి
నృత్య ప్రదర్శనలు

చిక్కడపల్లి, జూన్ 19 (విశ్వం న్యూస్) : శ్రీ త్యాగరాయ గాన సభ ప్రాంగణంలో ఈ నృత్య నిలయం అధ్యాపకురాలు గౌ శ్రీ డా అడపా భరణి గారి శిష్య బృందంచే చిక్కడపల్లిలోని ప్రపంచ రికార్డు నెలకొల్పిన శ్రీ త్యాగరాయ గానసభలో కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ప్రముఖ నృత్యకారులు దర్శకులు క్రాంతి కిరణ్, నివదిత పాల్గొని పిల్లల ప్రదర్శనలు తిలకించి పిల్లలను ఎంతగానో మెచ్చుకొన్నారు. అధ్యాపకురాలు కృషి తల్లి తండ్రిల ప్రోత్సాహం చూసి ఆనందం వ్యక్తం చేశారు. సనాతన నృత్య ప్రదర్శనలు ఇలా అభివృద్ధి చేయుట చాలా అవసరం ఉందని చిన్నప్పటి నుండి ఇలాంటి నృత్య ప్రదర్శనలు పిల్లల మానసిక ఎదుగుదల, సామాజిక, ఆరోగ్య విషయాల్లో చక్కని ఫలితాన్ని ఇస్తాయని సామాజిక కార్యకర్త డా.లక్ష్మీ వీరమల్లు వ్యక్తం చేశారు. వ్యవస్తాపకురాలు శ్రీ భరణి వందన సమర్పణ చేశారు.
