బిజెపి పార్టీ అవతరణ దినోత్సవం

వీణవంక, ఏప్రిల్ 6 (విశ్వం న్యూస్) : వీణవంక మండలంలో లక్ష్మక్కపల్లి, హిమ్మత్ నగర్ గ్రామాలలో భారతీయ జనతా పార్టీ అవతరణ దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతంరెడ్డి మాట్లాడుతూ భారతదేశంలోని అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని రెండు సీట్ల నుండి 300 పై స్థానాలు సాధించి కొన్ని రాష్ట్రాలలో అధికారం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడితే తెలంగాణలో కూడా అధికారం మనదేనని కార్యకర్తలకు సూచించారు.
ఈ సందర్భంగా కరీంనగర్ కిసాన్ మోర్చా కార్యదర్శి మారం తిరుపతిరెడ్డి మాట్లాడుతూ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ ప్రపంచ దేశాలే మన పార్టీ వైపు చూస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మక్క పల్లి బూత్ కమిటీ అధ్యక్షుడు మద్దుల ప్రశాంత్, కొండపాక మాజీ సర్పంచ్ వీరస్వామి, మేకల రాజి రెడ్డి, సింగిరెడ్డి రాజిరెడ్డి, రెడ్డి రాజుల స్వామి, లింగాల సాయి, మద్దుల రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.