కరీంనగర్

బిజెపి పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం

బిజెపి పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం

జమ్మికుంట, ఏప్రిల్ 6 (విశ్వం న్యూస్) : ఈరోజు లక్ష్మక్క పల్లి గ్రామంలో బిజెపి పార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని బూత్ కమిటీ అధ్యక్షుడు మద్దుల ప్రశాంత్ పటేల్ జెండాను ఎగరవేశారు. అనంతరం వారు మాట్లాడుతూ శ్యామ ప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఎందరో పార్టీ కోసం ప్రాణాలు త్యాగం చేసిన నాయకులను స్మరిస్తూ దేశంలోనే రెండు ఎంపీ స్థానాలు ఉన్న భారతీయ జనతా పార్టీ నేడు 303 స్థానాలు కైవసం చేసుకుని అవినీతి రహిత పరిపాలన చేస్తున్న దేశంలోనే ఏకైక పార్టీ ప్రపంచంలోనే 11 కోట్ల సభ్యత్వం కలిగిన అతిపెద్ద పార్టీగా అవతరించింది.

18 రాష్ట్రాలలో అధికారం చేపట్టి అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబోయే ఎన్నికలలో పూర్తి మెజార్టీని కైవసం చేసుకుంటుందని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో మేకల రాజిరెడ్డి, సింగిరెడ్డి రాజిరెడ్డి, రెడ్డి రాజుల స్వామి లింగాల సాయి ఐలయ్య రాజయ్య తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *