పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన కల్వకుంట్ల కవిత

పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన కవిత

హైదరాబాద్, జూలై 29 (విశ్వం న్యూస్) : పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆయనను పరామర్శించారు. ఆస్పత్రికి చేరుకున్న ఆమె, పెద్ది సుదర్శన్ రెడ్డికి అందిస్తున్న వైద్య చికిత్స, ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి భార్యతో పాటు కుటుంబ సభ్యులను కలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, అత్యుత్తమ వైద్యం అందించాలని వైద్యులను కోరినట్లు సమాచారం. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ఆమె అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

కల్వకుంట్ల కవిత పరామర్శతో పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలోనే ప్రజల మధ్యకు రావాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *