నేడు 9వ డివిజన్లో కంటి వెలుగు
కార్యక్రమం ప్రారంభం

డివిజన్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక కార్పొరేటర్ పిలుపు
స్థానిక కార్పొరేటర్ మోధుగు లావణ్య శేఖర్ రెడ్డిల ఆధ్వర్యంలో కంటి వెలుగు
బోడుప్పల్, ఏప్రిల్ 21 (విశ్వం న్యూస్) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్ శ్రీనివాస కాలనీ కమ్యూనిటీ హాల్ లో స్థానిక కార్పొరేటర్ మోదుగు లావణ్య శేఖర్ రెడ్డిల ఆధ్వర్యంలో కాలనీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డివిజన్ ప్రజలు అందరూ కూడా తెలంగాణ ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ మోదుగు లావణ్య శేఖర్ రెడ్డి మాట్లాడుతూ రేపటినుండి డివిజన్, కాలనీ వాసులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని కంటి పరీక్షలు చేసుకొని మందులు. కళ్ల అద్దాలు, అవసరమైన వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో కంటి ఆపరేషన్ కూడా ఉచితంగా నిర్వహిస్తారు కావున డివిజన్ ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని చేయించుకోవాలని కోరారు. నేడు సమయం:9.00 గంటల నుండి 4:00 గంటల వరకు తేదీ 21:.4.2023 నుండి 29.4.2023 వరకు కంటి వెలుగు పరీక్షలు చేస్తారని పేర్కొన్నారు.