భట్టి పాదయాత్రలో పొన్నం

హుజురాబాద్, ఏప్రిల్ 21 (విశ్వం న్యూస్) : సీఎల్పీ నాయకులు చేపడుతున్న పీపుల్స్ మార్చ్ నేడు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా, కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు డిసిసి అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మరియు ఇతర ముఖ్య నాయకులతో కలిసి హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం శంభునిపల్లి గ్రామం వద్ద భట్టి విక్రమార్క గారిని శాలువాతో సత్కరించి సాదర స్వాగతం తెలియజేసి అనంతరం భట్టి విక్రమార్క గారితో కలిసి పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో పాల్గొన్నారు.
