తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన తెలుగుదేశం పార్టీ నాయకులు

తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన
తెలుగుదేశం పార్టీ నాయకులు

గోవిందరావుపేట, మే 1 (విశ్వం న్యూస్) : అకాల వర్షాలతో వరి ధాన్యం తడిసి ముద్దయి రైతులు తీవ్ర నష్టానికి గురయ్యారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు యానాల అనంతరెడ్డి జిల్లా నాయకులు ధరావత్ దేవా అన్నారు. సోమవారం గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో ఐకెపి సెంటర్లో రైతుల తడిసిన ధాన్యాన్ని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించారు.

అనంతరం వారు మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం తడిసి ముద్దయిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఎకరాకు 50 వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు లేనియెడల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు కంచర్ల కృష్ణ ప్రసాద్, వసుల సమ్మయ్య, బానోతు గోపీచంద్, తదితరులు పాల్గొన్నారు.

తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *