వాలీబాల్ పోటీలో వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి జట్టు విజయం

వాలీబాల్ పోటీలో వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి జట్టు విజయం

వీణవంక, మార్చి 16 (విశ్వం న్యూస్) : ఖేలో కరీంనగర్ జీతో కరీంనగర్ పేరిట కరీంనగర్ పార్లమెంటు పరిధిలో జరుగుతున్న క్రీడా ఉత్సవాలలో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గం వాలీబాల్ పోటీలు జరిగాయి. ఈ పోటీ ఫైనల్ మ్యాచ్ లో హుజురాబాద్ జట్టుపైన వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి జట్టు ఘనవిజయం సాధించింది. ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంటు క్రీడా ఉత్సవ కన్వీనర్ కళ్లెం వాసుదేవ రెడ్డి, హుజురాబాద్ కో కన్వీనర్ సిహెచ్ నరసింహ రాజు, హుజురాబాద్ అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతం రెడ్డి, వీణవంక బిజెపి మండల అధ్యక్షుడు రామిడి ఆదిరెడ్డి, మల్లారెడ్డిపల్లి వాలీబాల్ జట్టును అభినందించినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *