15వ డివిజన్లో త్రిబుల్ ఆర్ సెంటర్ ను
ప్రారంభించిన మేయర్ జక్క వెంకట్ రెడ్డి

స్థానిక కార్పొరేటర్ బండారీ మంజుల
రవీందర్ల ఆధ్వర్యంలో
ముఖ్య అతిథులుగా మేయర్
జక్క వెంకట్ రెడ్డి, కమిషనర్ హాజరు
పీర్జాదిగూడ, జూన్ 1 (విశ్వం న్యూస్) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్ కార్పొరేటర్ బండారి మంజుల రవీందర్ ల ఆధ్వర్యంలో త్రిబుల్ ఆర్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్, కమిషనర్ వంశీకృష్ణ, స్థానిక 15వ డివిజన్ కార్పొరేటర్ బండారి మంజుల రవీందర్ ల చేతుల మీదుగా త్రిబుల్ ఆర్ సెంటర్ ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మద్ది యుగంధర్ రెడ్డి, పప్పుల అంజిరెడ్డి, అంజిరెడ్డి అలాగే డివిజన్ నాయకులు ఏవి రమణారెడ్డి, సంఘపాక సుధాకర్, దంతూరి వెంకటేష్ గౌడ్, డివిజన్ యూత్ అధ్యక్షులు బత్తి సుమిత్ పాల్ రెడ్డి, మున్సిపల్ అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.