
- ఖుషీ..ఖుషీగా మెగా ఫ్యాన్స్ సంబరాలు

హైదరాబాద్, జూన్ 20 (విశ్వం న్యూస్) : ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో మూడోతరం అడుగిడింది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. మంగళవారం తెల్లవారుజామున ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రి వైద్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాసన ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో, మెగా ఫ్యాన్స్‌లో సంబురాలు మిన్నంటాయి. మెగా ఫ్యాన్స్ అపోలో ఆసుపత్రి వద్దకు చేరుకొని, ఆసుపత్రి బయట అభిమానులు సంబరాలు చేసుకున్నారు.