వరంగల్:ఘనంగా విద్యా దినోత్సవం

ఘనంగా విద్యా దినోత్సవం

కార్పోరేటర్ అరుణను సత్కరిస్తున్న ప్రధానోపాధ్యాయులు

వరంగల్, జూన్ 20 (విశ్వం న్యూస్) : వరంగల్ నగరంలోని పెరుకవాడలో గల ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో తెలంగాణ విద్యా దినోత్సవంను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం పాఠశాల పరిసర ప్రాంతాల్లో విద్యార్థులచే భారీ ర్యాలీ చేపట్టారు.

అనంతరం ప్రధానోపాధ్యాయులు ఎం.బాలస్వామి, నర్సింహ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా కార్పోరేటర్ ఎం.అరుణసుధాకర్ పాల్గొని మాట్లాడారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని సూచించారు.

డ్రాయింగ్ పోటీలో ప్రతిభకనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేసిన ప్రధానోపాధ్యాయులు నర్సింహ

ఈ సందర్భంగా తెలంగాణ దశాబ్ది వేడుకల లోగో డ్రాయింగ్ పోటీలో ప్రతిభకనబరిచిన విద్యార్థులకు, తరగతుల వారీగా బెస్ట్ స్టూడెంట్ లకు బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం కార్పోరేటర్ అరుణ, ఎస్ఎంసీ చైర్మన్ జ్యోతిలను శాలువాలతో ఘనంగా సత్కరించారు.

నృత్యాలు, పాటలతో విద్యార్థులు అలరించారు. 8, 9, 10వ తరగతి గదుల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ ప్యానల్ బోర్డు మెటీరియల్ ను కార్పోరేటర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్ హేమలత, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *