భారత్‌లో ఎంజీ కామెట్ ఈవీ విడుదలైన పొట్టికారు..

  • ఒక్క ఛార్జ్ తో 230 కిమీ ప్రయాణం, ధర, ఫీచర్లు ఇవే!

హైదరాబాద్, ఏప్రిల్ 26 (విశ్వం న్యూస్) : ఎంజీ మోటార్స్ ఎలక్ట్రిక్ విభాగంలో మరో కారును ఆవిష్కరించింది. ఎంజీ కామెట్ ఈవీ పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. తాజాగా ఎంజీ మోటార్ ఇండియా కామెట్ ఈవీని లాంచ్ చేసింది. ఈ కారు ధర రూ. 10 లక్షల నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

ఫీచర్లు
కామెట్ కారులో డ్యూయల్ 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఉంటుంది. యాపిల్ iPod-లాంటి కంట్రోల్స్, 4-సీట్ల లేఅవుట్, 2-స్పోక్ స్టీరింగ్ వీల్‌ కూడా ఇందులో ఆఫర్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ కారు వెనుక భాగంలో యాక్సిల్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారు ఉంటుంది. సేఫ్టీ పరంగా, కారులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్‌, EBDతో కూడిన ABS, డోర్-అన్‌లాక్ ఫంక్షన్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, TPMS, రివర్స్ పార్కింగ్ కెమెరా, స్పీడ్-సెన్సింగ్ డోర్ లాక్ ఫంక్షన్, సీట్-బెల్ట్ రిమైండర్ సిస్టమ్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో ఉన్నాయి.

సింగిల్ ఛార్జ్‌పై 230కి.మీ రేంజ్
ఎంజీ కామెట్ ఈవీ అనేది ఇండోనేషియాలో విక్రయించే వులింగ్ ఎయిర్ ఈవీని పోలి ఉండే కొత్త ఎలక్ట్రిక్ కారు. దీనిని చిన్న ఎలక్ట్రిక్ వాహనాల కోసం రూపొందించిన GSEV అనే ప్లాట్‌ఫామ్‌పై డిజైన్ చేశారు. ఈ వెహికల్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్ ఆఫర్ చేస్తుంది. ఇందులో ఇచ్చిన 17.3kWh బ్యాటరీని టాటా ఆటోకాంప్ తయారు చేసింది. 3.3kW AC ఛార్జర్‌తో 5 గంటల సమయంలో ఈ బ్యాటరీ 0 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఫుల్ ఛార్జ్ కావడానికి దాదాపు 7 గంటల సమయం తీసుకుంటుంది. కారులోని ఎలక్ట్రిక్ మోటార్లు 41 హార్స్‌పవర్ (Hp), 110 న్యూటన్-మీటర్ల (Nm) టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *