ఐకెపి సెంటర్ ను ప్రారంభించిన
ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి

వీణవంక, ఏప్రిల్ 26 (విశ్వం న్యూస్) : కరీంనగర్ జిల్లా మండలం వీణవంక చల్లూరు గ్రామంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఐకెపి సెంటర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జ్యోతి రమేష్, ఎంపిటిసి సవితా మల్లన్న, డైరెక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి, జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాలకిషన్ రావు, BRS నాయకులు మాడ సాధవరెడ్డి, ముసిపట్ల తిరుపతిరెడ్డి, వార్డ్ మెంబర్ నాగేష్, రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.