గంధం గూడా–బైరాగి గూడా అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ స్పష్టమైన హామీ

హైదరాబాద్, నవంబర్ 17 : బండ్లగూడ–నార్సింగి పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్లు, డ్రైనేజ్ సమస్యల పరిష్కారానికి మరో ముందడుగు పడింది. ఈరోజు జరిగిన సమావేశంలో గంధం గూడా మరియు బైరాగి గూడా ప్రాంతాల్లో కొద్దిపాటి పెండింగ్‌లో ఉన్న రోడ్లు, డ్రైనేజ్ పనుల వివరాలతో కూడిన వర్క్‌షీట్‌ను గౌరవనీయులు శాసనసభ సభ్యులు ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ గారికి మర్యాదపూర్వకంగా అందజేశారు.
సమావేశంలో ఎమ్మెల్యే గారు ప్రజల సమస్యలపై చానుకూలంగా స్పందిస్తూ,
“పెండింగ్‌లో ఉన్న అన్ని అభివృద్ధి పనులను అత్యంత త్వరలో పూర్తి చేస్తాం” అని హామీ ఇచ్చారు.
ఈ సమావేశం విజయవంతం కావడానికి సహకరించిన నాయకులు:
- పూలపల్లి కృష్ణారెడ్డి – బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
- తలారి ప్రేమ్ కుమార్ – నార్సింగి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
- సాధిక్ – నార్సింగి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
- భోగాల శ్రీనివాస్ – మాజీ ఎంపిటిసి
- అంకం శ్రీనివాస్ – బీసీ సెల్ అధ్యక్షులు
అలాగే ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ సమావేశం నూతన ఆశలు నింపింది.