గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను పరామర్శించిన ఎమ్మెల్సీ కొమరయ్య
గవర్నర్ ను పరామర్శించిన
ఎమ్మెల్సీ కొమరయ్య

విశ్వం న్యూస్, హైదరాబాద్, ఆగస్టు 30 : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య శనివారం లోక్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల గుండె సంబంధిత సమస్యతో చికిత్స పొందిన గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
గవర్నర్‌కు అందుతున్న వైద్య చికిత్స వివరాలను తెలుసుకున్న ఎమ్మెల్సీ కొమరయ్య, ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కొమరయ్య మాట్లాడుతూ.. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ వారికి ఉండాలని, ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ఉత్సాహంగా కొనసాగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
గవర్నర్ త్వరగా కోలుకుని రాష్ట్ర ప్రజలకు మరింత సేవలందించాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ఆకాంక్షించారు.