నల్లగొండ జాతర పోస్టర్ ఆవిష్కరించిన చేసిన ఎమ్మెల్యే డా.రసమయి

తిమ్మాపూర్, పిబ్రవరి 26 (విశ్వం న్యూస్) : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలోని శ్రీ సీతారామ లక్ష్మీనృసింహ్మస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవ వేడుకల (జాతర) పోస్టర్ ను ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మెన్, మానకొండూర్ శాసనస భ్యులు డా.రసమయి బాలకిషన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. రసమయి మాట్లాడుతూ ఈ నెల 26 నుండి వచ్చే నెల 10వ, తేది వరకు అత్యంత వైభవంగా జరిగే ఈ వేడుకలకు మానకొండూర్ నియోజకవర్గంలోని ప్రజలు భారీ సంఖ్యలో హాజరై స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని ఎమ్మెల్యే రసమయి కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామ లక్ష్మీ నృసింహ్మస్వామి ఆలయ చైర్మన్ దన్నమనేని శ్రీనివాసరావు, ఆలయ కార్యనిర్వహణ అధికారి ఉడుత వెంకన్న, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, నాయకులు దన్నమనేని నరసింహారావు, ధనమనేని సురేందర్ రావు, పాశం అశోక్ రెడ్డి, టీఎన్జీవో నాయకులు మారం జగదీశ్వర్ లతో పాటు ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.