అమావాస్య రోజున హైదరాబాద్‌లో దారుణం బాలుడిని నరబలి

  • సనత్‌నగర్‌లో దారుణ ఘటన
  • 8 ఏళ్ల బాలుడిని బలి ఇచ్చిన హిజ్రా
  • హిజ్రా ఇంటిపై దాడికి
    పాల్పడ్డ స్థానికులు

హైదరాబాద్‌, ఏప్రిల్ 21 (విశ్వం న్యూస్) : హైదరాబాద్‌ సనత్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ 8 ఏళ్ల బాలుడ్ని నరబలి ఇచ్చింది. ఈ ఘటనలో బలైన బాలుడు అబ్దుల్‌ వహీద్‌గా గుర్తించారు. అమావాస్య వేళ ఆ మహిళ బలి ఇచ్చినట్లుగా స్థానికుల ఆరోపిస్తున్నారు. ఓ నాలా సమీపంలో బాలుడి మృతదేహం లభించడంతో సదరు మహిళ ఇంటిపై స్థానికులు దాడికి దిగారు. దీంతో సనత్‌నగర్‌లోని అల్లాదున్ కోటి ఏరియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సనత్‌నగర్‌ పారిశ్రామికవాడలోని అల్లాదున్‌ కోటిలో నివసించే రెడీమేడ్‌ దుస్తుల వ్యాపారి వసీంఖాన్‌ కుమారుడు (8)ను స్థానికంగా నివసించే ఫిజాఖాన్‌ అనే ఓ మహిళ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

నరబలి ఘటనపై స్థానికుల ఫిర్యాదులో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్నారు. హిజ్రాను అదుపులోకి తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. బాలుడి నరబలికి సంబంధించి స్థానికుల నుంచి పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.

కాగా బాలుడి మృతదేహాన్ని జింకలవాడ సమీపంలోని ఓ నాలాలో వేసినట్లు నిందితులు అంగీకరించారు. దీంతో గురువారం అర్ధరాత్రి పోలీసులు స్థానికుల సహాయంతో నాలాలో వెతికారు. ఓ ప్లాస్టిక్‌ సంచిలో మృతదేహం ఉన్నట్లు గుర్తించి వెలికి తీశారు. కాగా బాలుడిని హత్య చేసిన నిందితులు.. ఎముకలను ఎక్కడిక్కడ విరిచి ఓ బకెట్‌లో కుక్కారు. అనంతరం బకెట్‌ను ప్లాస్టిక్‌ సంచిలో వేసి వెళ్లి నాలాలో విసిరేసినట్లు తెలిసింది. బాలుడిని నరబలి ఇచ్చినట్లుగా బస్తీవాసులు చెబుతున్నారు. మరోవైపు చిట్టీ డబ్బుల గొడవ కారణంగానే హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

  • బాలుడి హత్యలో దోషులను కఠినంగా శిక్షిస్తాం: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
  • సనత్ నగర్ లోని అల్లా ఉద్దీన్ కోటి లో దారుణ హత్యకు గురైన బాలుడు వాహిద్ (8) కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి
  • సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి
  • ముక్కు పచ్చలు ఆరని చిన్నారి బాలుడి మృతి చాలా బాధాకరం
  • పవిత్ర రంజాన్ సందర్భంగా ఉపవాస దీక్షలో ఉన్న బాలుడిని హత్య చేయడం దుర్మార్గపు చర్య
  • బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండి ఆదుకుంటాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *