పెద్దపల్లి నియోజకవర్గం: ఖమ్మంకు తరలిన గులాబీ దండు

పెద్దపల్లి నియోజకవర్గం: ఖమ్మంకు తరలిన గులాబీ దండు

పెద్దపల్లి, జనవరి 18 (విశ్వం న్యూస్) : భారత రాష్ట్ర సమితి తొలి బహిరంగ సభ కోసం పెద్దపల్లి గులాబీ దండు ఖమ్మంకు తరలి వెళ్లారు. బుధవారం పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి గౌరవ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గానికి చెందిన బీ ఆర్ స్ ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఖమ్మం కు వెళ్లారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మాట్లాడుతూ ఖమ్మం సభతో దేశ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు ప్రపంచంలో ఎక్కడా లేవని, దేశ ప్రజలందరూ బిఆర్ఎస్ ను ఆదరిస్తే తెలంగాణ పథకాలు దేశమంతా అమలవుతాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *