వీవోఏలు… జీతాల పెంపు…

వీవోఏలు… జీతాల పెంపు…

  • సిఎం కేసీఆర్ నిర్ణయం మేరకు తక్షణమే జారీ అయిన జీ.వో…
  • ఇందుకు సబంధించి మహిళా సంఘాల ప్రతినిధులతో సమావేశమై ప్రకటించాలని మంత్రి హరీశ్ రావు కు సిఎం కేసీఆర్ ఆదేశం…

హైదరాబాద్, ఆగస్టు 31 (విశ్వం న్యూస్) : రక్షా బంధన్ కానుకగా, రాష్ట్రంలోని మహిళా సంఘాల సహాయకు(వీ వో ఏ) ల వేతనాలను పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు నిర్ణయించారు. సిఎం గారి నిర్ణయం మేరకు వీరి వేతనాలు నెలకు రూ. 8000 కు పెరగనున్నాయి. ఉమ్మడి రాష్ట్ర కాలంలో గ్రామాల్లో పొదుపు సంఘాలుగా ఏర్పడిన మహిళలకు సహాయకులుగా పనిచేస్తూ, సంఘానికి సంబంధించిన ఆర్థికపరమైన అంశాలు, తదితర సమాచారాన్నినోట్ బుక్కుల్లో నమోదు చేసే విధులను స్వచ్ఛందంగా నిర్వహించేవారు. వీరి కృషిని కనీసం గుర్తించని నాటి ప్రభుత్వాలు వారి మానాన వారిని వదిలేసాయి. వారు సేవ చేస్తున్న మహిళా సంఘాలనుంచి మాత్రమే ‘గ్రూపు లీడర్లు’ గా కేవలం నెలకు రెండు వేలు రూపాయలు గౌరవ వేతనం తప్ప వారికి మరో ఆసరా లేకుండే. కాగా, పొదుపు సంఘాలలోని మహిళలను సంఘటితం చేస్తూ, వారిని చైతన్య పరుస్తూ సమన్వయ కర్తలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వీవోఏ ల కృషిని, స్వచ్ఛందంగా వీరు చేస్తున్న సేవలను స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గుర్తించారు.

తద్వారా సిఎం కేసీఆర్ మానవీయ పాలనలో వీరికి కూడా ఎంతో కొంత గౌరవ వేతనం అందించాలని నిర్ణయం జరిగింది. దాంతో… 2016 సంవత్సరం నుంచి వీరికి నెలకు మూడు వేల రూపాయలను గౌనవ వేతనంగా అందించడం జరిగుతూ వస్తున్నది. అంతే కాకుండా అందరికీ ఇటీవలే పెంచిన పీఆర్సి ని వీరికి కూడా అమలు చేస్తూ మరోమారు తన మానవీయ కోణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. దాంతో వీరికి ప్రభుత్వం అందించే వేతనం రూ.3900 కు చేరింది.

దాంతో మహిళా సంఘాలనుంచి అందే రెండు వేలుతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే 3900 మొత్తం కలిపితే వీరి వేతనం కేవలం రూ.5900 మాత్రమే. ఈ పరిస్థితుల్లో వీరు క్షేత్రస్థాయిలో పడుతున్న కష్టాన్ని గుర్తించిన సిఎం కేసీఆర్ మరోసారి ఆదకుని ఆసరానందించేందుకు నిర్ణయించారు. వారి విజ్జప్తి మేరకు రాఖీ పండుగ కానుకగా వీరి జీతాలను పెంచాలని నిర్ణయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *