
బండ్లగూడ జాగీరు, డిసెంబర్ 27 (విశ్వం న్యూస్) : బండ్లగూడ జాగీరును రాజేంద్రనగర్ జోన్లో కలపడంలో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొరివి గణేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం బండ్లగూడ జాగీర్ ప్రాంత అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

ప్రకాష్ గౌడ్ గారి నాయకత్వంలో బండ్లగూడ జాగీర్ అభివృద్ధి వేగంగా ముందుకు సాగుతుందని కొరివి గణేష్ అన్నారు. రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, ఇతర మౌలిక వసతుల కల్పనకు ఇప్పటికే ప్రకాష్ గౌడ్ తీసుకుంటున్న చొరవ ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని ప్రశంసించారు.
ప్రజల అవసరాలను నేరుగా తెలుసుకుని, సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దూరదృష్టితో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల బండ్లగూడ జాగీర్ సమగ్ర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు. భవిష్యత్తులో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో ఈ ప్రాంతాన్ని ఆదర్శంగా నిలపాలని ఆయన ఆకాంక్షించారు.