డివిజన్ ప్రజల మధ్యన కార్పొరేటర్ బచ్చ రాజు జన్మదిన వేడుకలు

డివిజన్ ప్రజల మధ్యన కార్పొరేటర్
బచ్చ రాజు జన్మదిన వేడుకలు

మేయర్ జె.వి.ఆర్ పార్టీ అధ్యక్షుడు డి డి ఆర్ కార్పొరేటర్ల శుభాకాంక్షలు
పీర్జాది గూడ, ఏప్రిల్ 16 (విశ్వం న్యూస్) : పీర్జాది గూడ మున్సిపల్ కార్పొరేషన్ 9వ డివిజన్ కార్పొరేటర్ బచ్చరాజు పుట్టినరోజు పురస్కరించుకొని తన ఆత్మీయ 9వ డివిజన్ ప్రజలు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, కుటుంబ సభ్యుల మధ్యన ఆడంబరంగా తన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి,డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్, గ్రంథాలయ చైర్మన్, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దర్గా దయాకర్ రెడ్డి, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ముఖ్యంగా డివిజన్ ప్రజలందరూ, కమిటీ నాయకులు, సభ్యులు ప్రతి ఒక్కరూ రోజంతా జన్మదిన శుభాకాంక్షలతో పండుగ జరుపుకున్నట్లు నా జన్మదిన వేడుకలు జరిపారని, వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారందరి ప్రేమాభిమానాలు, దీవెనలు నా జీవితాంతం ఇలానే ఉండాలని కార్పొరేటర్ బచ్చ రాజు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా తొమ్మిదో డివిజన్ ప్రజలు కుటుంబ సభ్యులు పార్టీ అనుబంధ సంఘాల మిత్రులు పెద్దలు ప్రతి ఒక్కరూ రోజంతా నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు, కేక్ కటింగ్స్ తో రోజంతా పండుగలా జరుపుకున్నారని, వారందరి ఆత్మీయ శుభాకాంక్షలు, పలకరింపులు దీవెనలు ఎల్లప్పుడూ నా జీవితకాలం ఉండాలని ఆ మల్లన్నను కోరుకున్నట్లు తెలియజేశారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి మల్లారెడ్డి టెలిఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారని వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *