శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి బోనాల
పండుగ నిర్వాహణ గురించి
గౌడ కులస్తులతో సమావేశం

కరీంనగర్ బ్యూరో, ఏప్రిల్ 19 (విశ్వం న్యూస్) : శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి బోనాల జాతర పండుగ నిర్వాహణ కార్యక్రమం గురించి అత్యవసర సమావేశం. మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ ల అధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయ ప్రాంగణంలో (పెద్దపల్లి బై పాస్ రోడ్ లో) గురువారం ఉదయం 10 గంటలకు గౌడ సంఘం నాయకులు, గౌడ కులస్తులకు అత్యవసర సమావేశం ఉన్నది. కావున గౌడ పెద్దలు, గౌడ సంఘం నాయకులు, గౌడ కులస్తులు, గౌడ యువకులు సమావేశానికి హాజరు కావాలని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయ కమిటీ నిర్వాహకులు కోడూరి మహేందర్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.