ఆదివారం నుండి శ్రీ రేణుకాదేవి ఎల్లమ్మ బోనాల పండుగ

ఆదివారం నుండి శ్రీ రేణుకాదేవి
ఎల్లమ్మ బోనాల పండుగ

కరీంనగర్, ఏప్రిల్ 4 (విశ్వం న్యూస్) : భక్తులారా! కరీంనగర్ పట్టణము, బొమ్మకల్ బైపాస్ రోడ్డులో గల
శ్రీశ్రీశ్రీ రేణుకాదేవి ఎల్లమ్మ ఆలయ “బోనాల పండుగ”

స్వస్తిశ్రీ శోభకృతు నామ సం||ర చైత్ర శు|| వైశాఖ తేదీ 23-04-2023 ఆదివారం నుండి తేది 26-04-2023 బుధవారం వరకు శ్రీ రేణుకాదేవి ఎల్లమ్మ బోనాల పండుగ పూజలు వైభవంగా జరుపబడును.

కార్యక్రమ వివరములు
తేది 05-04-2023 బుధవారం రోజున అమ్మవారి ఉత్సవ విగ్రహ గంగస్నానం, లంద కి బొట్టు కార్యక్రమము తేది 06-04-2023 నుండి 22-04-2023 వరకు జోగు కార్యక్రమ నిర్వహణ.
పోచమ్మ తల్లి బోనాలు తేది 23-04-2023 ఆదివారం అక్షయతృతీయ రోజున
ఉదయం 7-00 గం॥ల నుండి
శ్రీ పోచమ్మ తల్లి బోనాలు ప్రారంభం
తేది 24-04-2023 సోమవారం రోజున సాయంత్రం
ఘటం కుండ ఊరే గింపు. (పాతబజార్ నుండి)

బోనాల పండుగ
స్వస్తిశ్రీ శోభకృతు నామ సం||ర వైశాఖ శు || పంచమి తేది 25-04-2023 మంగళవారం రోజున
సా|| 6-00 గం॥ల నుండి శ్రీ రేణుకా దేవి ఎల్లమ్మతల్లి బోనాల జాతర, పట్టణ వీదుల గుండా మంగళవాయిద్యాలు, డప్పు చప్పుల్లతో గౌడ బంధువుల గృహముల నుండి బయలు దేరి రాత్రి 8-00 గం॥లకు శ్రీ రేణుకాదేవి ఎల్లమ్మ దేవాలయం వద్దకు చేరుకొనుట. ఊరేగింపు అనంతరము ఆలయము వద్ద భక్తులకు భోజన సదుపాయం కలదు.

రాత్రి 10-00 గం||లకు శ్రీ రేణుకాదేవి శ్రీ జమదగ్నిల సిద్దయాగ కళ్యాణ మహోత్సవము
తేది 26-04-2023 బుధవారం రోజున భక్తులు నాగవెల్లి పట్నాలు, మొక్కులు చెల్లించుకొనుట, మహా పూజా మంగళహారతి, మంత్ర పుష్పము అమ్మవారి ఆశీర్వాదాలతో పూజా ఉత్సవాలు సమాప్తము.
పై కార్యక్రమములకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దీవెనలను పొందగలరని మనవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *