తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది
ఉత్సవాల్లో విద్యార్థి మృతి

- కమలాపూర్ మండలం మరిపెళ్లి గూడెంలో విషాదం
- విద్యా పండుగ వేడుకల్లో భాగంగా ర్యాలీ తీస్తుండగా ఘటన
కమలాపూర్, జూన్ 20 (విశ్వం న్యూస్) : విద్య పండుగా ర్యాలీ తీస్తుండగా ట్రాక్టర్ కింద పడి 6వ తరగతి విద్యార్థి ఇనుగాల ధనుష్(10) మృతి. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఉపాధ్యాయులు ఈరోజు ఉదయం విద్యార్థులతో గ్రామంలో ర్యాలీ నిర్వహిస్తుండగా.. కుక్క ఒక్కసారిగా ధనుష్ మీదకు రావడంతో అతను భయపడి పక్కకు జరుగుతుండగా ట్రాక్టర్ కిందపడ్డాడు. ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి పూర్తి చేసి ఈ విద్యా సంవత్సరం 6వ తరగతిలో ప్రవేశం కోసం హైస్కూల్ కు వెళ్లిన ధనుష్.
కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు జయపాల్ స్వప్న. పాఠశాల నిర్వహకుల నిర్లక్ష్యమే విద్యార్థుల ప్రాణం తీసింది అంటున్న గ్రామస్తులు. పాఠశాల నిర్వాహకులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు.