కాంగ్రెస్ ఓబీసీ సెల్ ఉపాధ్యక్షుడిగా తాళ్లపల్లి మురళి గౌడ్

కాంగ్రెస్ ఓబీసీ సెల్ ఉపాధ్యక్షుడిగా తాళ్లపల్లి మురళి గౌడ్

పీర్జాదిగూడ, పిబ్రవరి 14 (విశ్వం న్యూస్) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ ఓబీసీ సెల్ ఉపాధ్యక్షుడిగా నియమితులైన తాళ్లపల్లి మురళి గౌడ్ మరియు పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ ఓబిసి సెల్ ప్రధాన కార్యదర్శిగా బొడ్డుపల్లి మురళి గారికి పిర్జాదిగూడ మున్సిపల్ కాంగ్రెస్ ఓబీసీ సెల్ చైర్మన్ రంగన్న గౌడ్ గారి చేతుల మీదుగా వారికి నియామక పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి గారు మరియు ప్రధాన కార్యదర్శి పన్నల శ్రీనివాస్ రెడ్డి గారు ఓబీసీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ పవన్ కుమార్ గౌడ్ గారు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి మోహన్ కుమార్ గారు మేడిపల్లి మండల ఓబిసి సెల్ చైర్మన్ ఐలేష్ యాదవ్ గారు మరియు పిర్జాదిగూడ కాంగ్రెస్ కమిటీ సభ్యులు వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు మజర్ గారు సుభాష్ గారు, యువజన కాంగ్రెస్ నాయకులు బొడిగే ఉదయ్ గారు మరియు శ్రీకాంత పటెల్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడు లాగా పనిచేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *