కన్నుల పండుగగా ఉరుసు ఉత్సవాలు

బిజిగిరి షరీఫ్ దర్గా కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ ఎగ్బాల్ భాయ్ ఆధ్వర్యంలో
జమ్మికుంట, పిబ్రవరి 15 (విశ్వం న్యూస్) : హజరత్ సయ్యద్ అమీనా బిబి దర్గా బిజిగిరి షరీఫ్ సందల్ మరియు ఉరుసు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో బిజిగిరి షరీఫ్ దర్గా చుట్టుపక్క గ్రామాల ముస్లిం ప్రజలు, మరియు హిందూ ప్రజలు కలిసి మెలసి అందరూ ఏకమై ప్రతి సంవత్సరం, డబ్బు చప్పట్ల మధ్యల ఊరేగింపు, హజరత్ సయ్యద్ అమీనా బేబీ ఉరుసు మరియు సందల్ ఉత్సవాలలో పాల్గొనడం జరుగుతుంది. ఈ వేడుకలో వీరితోపాటు పెద్ద ఎత్తున ప్రజలు మరియు భక్తులు మరియు దర్గా కమిటీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.


