తెగిన కరెంటు తీగలకు మూడు బర్లు బలి

- గ్రామ పంచాయతీ, రైతు సంఘాల ద్వారా ఘటనను విద్యుత్ శాఖ, పశు సంరక్షణ శాఖ దృష్టికి తీసుకెళ్లాలి
నాగారం, అక్టోబర్ 31 (విశ్వం న్యూస్):
నాగారం మండలంలోని ఈటూరు గ్రామానికి చెందిన దళిత పేద రైతు పేరాల చంద్రు (తండ్రి వీరయ్య) గారికి చెందిన మూడు బర్లు దుర్మరణం చెందాయి. ఇటీవల కురిసిన వర్షాల వలన కరెంటు తీగలు తెగిపోవడంతో మేతకు వెళ్లిన బర్లు ఆ తెగిన తీగలను తాకి మృతి చెందాయి.

మూడు బర్ల విలువ సుమారు రెండు లక్షల రూపాయల వరకు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. పాల ఉత్పత్తి మరియు కౌలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ఈ కుటుంబం తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ప్రభుత్వానికి విజ్ఞప్తి:
ఈ పేద దళిత రైతు కుటుంబానికి మూలాధార ఆదాయం కోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వం సానుభూతితో ముందుకొచ్చి తగిన పరిహారం చెల్లించాలని, గ్రామ పంచాయతీ మరియు రైతు సంఘాలు ఈ విషయాన్ని జిల్లా విద్యుత్ శాఖ, పశు సంరక్షణ శాఖ దృష్టికి తీసుకెళ్లాలని గ్రామస్థులు కోరుతున్నారు.