వాణిజ్య పన్నుల శాఖలో బదిలీలు చేపట్టండి

  • వాణిజ్య పన్నుల శాఖ నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్‌ ముజాహిద్‌ హుస్సేన్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి

హైదరాబాద్‌, ఏప్రిల్ 13 (విశ్వం న్యూస్) : వాణిజ్య పన్నుల శాఖలో పదోన్నతులు పొందిన ఉద్యోగులకు పోస్టింగ్‌ లు ఇవ్వాలని, వెంటనే సాధారణ బదిలీల ప్రక్రియ చేపట్టాలని వాణిజ్య పన్నుల శాఖ నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్‌ ముజాహిద్‌ హుస్సేన్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతకుమారి ఐఏఎస్ లకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఐదేళ్ల నుంచి సాధారణ బదిలీల ప్రక్రియ కూడా పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు చేసినట్లయితే కొత్త జోనల్లో కేటాయించిన వారికి బదిలీలు చేస్తారా లేక కొత్తజూన్ల ప్రకటించినప్పుడు 317 జీవో ప్రకారముగా బదిలీ అయిన ఉద్యోగులు తప్ప ఆ జూన్లలో ఉన్న ఉద్యోగులకు బదిలీలు చేస్తారా అలాంటప్పుడు ఆ జూన్లకు కేటాయించినప్పుడు ఆ జోన్ ప్రకారములో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన సీనియార్టీలు ఇప్పటివరకు చేపట్టలేదు అలాంటప్పుడు ఆ జోనల్ పనిచేస్తూ పదవి విరమణ చేసిన ఉద్యోగుల స్థానాలలో కిందిస్థాయి ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలంటే ఆ యొక్క జోన్ సీనియార్టీ తయారు చేయవలసిన అవసరం ఎంతో ఉంది. ఇప్పటివరకు కొత్త జోనల్ అయినప్పటి నుండి ఇప్పటివరకు ఆ జోనల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సీనియార్టీలను ఇప్పటివరకు కూడా తయారు చేయలేదు.

అలాంటప్పుడు ఆ శాఖలలో ఖాళీ అయిన పోస్టుల్లో ఎవరికైనా ఉద్యోగికి ప్రమోషన్ ఇవ్వాలంటే ఏ ప్రకారంగా ఇస్తారు ఉద్యోగులలో చర్చలు కొనసాగుతున్నాయి గతంలో జోన్లకు బదిలీలైన ప్రభుత్వ ఉద్యోగులు 317 జీవో ప్రకారం గా ఆ ప్రాంతముకు కేటాయించిన ఉద్యోగులు అదే ప్రాంతంలో పనిచేస్తున్నారు. అలాంటప్పుడు ఆ యొక్క జోన్ లో పనిచేస్తున్న ఉద్యోగికి ఆ జోన్ లో ఉన్న ఖాళీలను బట్టి బదిలీలు చేస్తారా లేక ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ చేసినా ఉద్యోగులకు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు బదిలీలు చేస్తారా అని ప్రభుత్వ ఉద్యోగులు మాట్లాడుకుంటున్నారు.

దాదాపు సాధారణ బదిలీలు కాకపోవడంతో చాలామంది ఉద్యోగులు అదే ప్రాంతాలలో కొన్ని సంవత్సరాల నుండి అక్కడే పనిచేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణ బదిలీలు ఎప్పుడు జరుగుతాయని చాలామంది ఉద్యోగులు ఎదురుచూస్తున్నారని, కొన్ని శాఖలలో ప్రమోషన్లు కల్పించిన ఆ యొక్క ఉద్యోగులకు ఆ ప్రాంతాల నుండి బదిలీలు చేయకుండా ప్రమోషన్ ఇచ్చిన అదే స్థానంలో అక్కడనే చాలామంది అలాగనే పనిచేస్తున్నారని, గతంలో జరిగిన 317 జీవో ప్రకారం భార్య భర్తలు కూడా ఒక ప్రాంతంలో లేకుండా భార్య ఒక ప్రాంతంలో భర్త మరియు ఒక ప్రాంతంలో పనిచేస్తున్నారు.

కొన్ని శాఖలలో భర్తలు చనిపోయిన భార్యలకు కూడా చాలా దూరపు ప్రాంతంలో బదిలీలు చేయడం వల్ల కూడా వారి ఇంటి కుటుంబాలలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనుక అలాంటి వారిని తిరిగి వారి యొక్క జిల్లాలలో నియమిస్తే చాలా బాగుంటుందని ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీలకు విజ్ఞప్తి చేశారు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణ బదిలీలు చేసేటప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నాయకులతో సంప్రదింపులు చేసి చర్చించి ఉద్యోగులకు కూడా ఎవరికి కూడా ఇబ్బందులు కాకుండా చూడాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులతో ఫ్రెండ్లీగా కొనసాగుతోంది కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాల ఎన్నో సంక్షేమ పథకాలు అమలుపరిచినప్పుడు ఆ యొక్క సంక్షేమ పథకాలు నిరుపేద ప్రజలకు అందినట్లు కృషి చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు కూడా న్యాయం చేకూర్చాలని ముజాహిద్ హుస్సేన్ తెలిపారు.

కొత్త జోనల్ ఏర్పడి సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఆ జోనల్లో అక్కడ ప్రాంతాలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సీనియార్టీలను తయారు చేయలేదు. గతంలో ఉన్న జోనల్ సీనియార్టీ వివరాలను కొత్త జోన్లలో తెప్పించుకొని పెట్టినారు ఏ జోనల్ కు ఏ ఉద్యోగి ఏ జోనల్లో పనిచేస్తున్నారు. అక్కడ ఉద్యోగి సీనియార్టీని తయారు చేయించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు కూడా 317 జీవో ప్రకారంగా బదిలీలైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న అలాంటి ఉద్యోగులకు కొంతమందికైనా న్యాయం చేకూర్చాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వములో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు జరగాక చాలా సంవత్సరాలు గా ఒకే ప్రాంతంలో పనిచేస్తున్నారు కనుక అలాంటి ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సాధారణ బదిలీలైన చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *