యువతకు స్ఫూర్తి స్వామి వివేకానంద

యువతకు స్ఫూర్తి స్వామి వివేకానంద

విభాగ్ గోరక్ష ప్రముఖు ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి
తిమ్మాపూర్, జనవరి 12 (విశ్వం న్యూస్) : భారతీయ ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప తత్వవేత, యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకా నంద. గురువారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వివేకానంద విగ్రహనికి పూల మాలలు వేసి, ఘన నివాళులు అర్పించిన కరీంనగర్ జిల్లా జిల్లా హిందూ సంఘాల నేతలు, నాయకులు. ఈ సందర్భంగా విభాగ్ గోరక్ష ప్రముఖు ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి మాట్లాడుతూ…స్వామి వివేకానంద భారతదేశాన్ని జాగృతం చేయడమే కాకుండా, అమెరి కా ఇంగ్లాండ్ లో యోగా, వేదంత శాస్త్రములను తన ఉపన్యాసం, ప్రసంగాల ద్వారా భారతదేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహానుభావుడు అని కొనియా డారు. స్వామి వివేకానంద ఉపన్యాసాలు చూసి ముగ్ధులైన విదేశీయులు, అమెరికావాసులు స్వామి వివేకానందకు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికీ కూడా పశ్చాత్యదేశాల్లో ప్రపంచవ్యాప్తంగా వేల కొలది అభిమానులు ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్ర మంలో రాష్ట్ర సేవా ప్రముఖ కోమల్ల రాజేందర్ రెడ్డి జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రావు, జిల్లా కార్యదర్శి విద్యాసాగర్, పట్టణ అధ్యక్షులు రమేష్, నవనీత్రావు భగవాన్ రావు, ఆంజనేయులు, జగదీశ్వరచారి, గుజ్జే టి రాజేందర్ లతో పాటు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

తిమ్మాపూర్ లో ఘనంగా జయంతి వేడుకలు…
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో గురువారం స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో  స్వామి వివేకానంద చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి, ఉపాధ్యక్షులు పబ్బ తిరుపతి, దళిత మోర్చా ఉపాధ్యక్షులు ఉప్పు లేటి బాబు, బోళ్ల శంకర్, సిద్ధ శ్రీనివాస్, మురళి లతో పాటు కార్యకర్తలు, అభిమా నులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *