వైఎస్ షర్మిల అరెస్ట్

వైఎస్ షర్మిల అరెస్ట్

పాదయాత్ర అనుమతి రద్దు..!!
ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌పై అనుచిత వ్యాఖ్యలు..

మహబూబాబాద్‌, పిబ్రవరి 19 (విశ్వం న్యూస్) : వైటీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పాదయాత్రకు మహబూబాబాద్‌లో బ్రేక్‌పడింది. మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ప్రజలు ఆమెను అడ్డుకున్నారు. వైఎస్ షర్మిల పాదయాత్ర ప్రస్తుతం మహబూబాబాద్‌ లో కొనసాగుతోంది. అయితే, శంకర్ నాయక్ పైన షర్మిల చేసిన వ్యాఖ్యల పైన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసారు. కనుసైగ చేస్తే చాలు తమ పార్టీ కార్యకర్తలు తరిమి కొడతారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేసిన వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ వేశారు. శంకర్ నాయక్ సైగ చెయ్యి.. ఎవడోస్తాడో చూస్తా అంటూ సవాల్ విసిరారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదు ఈ వైఎస్సార్ బిడ్డ అని ధ్వజమెత్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *