హైదరాబాద్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఈ ప్రపంచానికే ఆదర్శ ప్రాయుడు: మంత్రి మల్లారెడ్డి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఈ ప్రపంచానికే
ఆదర్శ ప్రాయుడు: మంత్రి మల్లారెడ్డి

  • మంత్రి మల్లారెడ్డి, మాజీ జడ్పిటిసి సభ్యులు మంద సంజీవరెడ్డి హాజరు

ఈరోజు బంగారు తెలంగాణ రాష్ట్రంలో ఒక చారిత్రకమైనటువంటి ఘట్టం జరిగిందని చెప్పుకోవచ్చు. వివరాల్లోకి వెళితే ప్రపంచ మేధావి, భారతరత్న, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన 125 అడుగుల అంబేద్కర్ మహా విగ్రహ ఆవిష్కరణ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మనవడు డాక్టర్ ప్రకాష్ అంబేద్కర్ విచ్చేసి అంబేద్కర్ మహా విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి,ఉమ్మడి ఘట్కేసర్ మండల్ మాజీ జడ్పిటిసి సభ్యులు ,బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ తదితరులు హాజరై ఈ మహా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని అంబేడ్కర్ కు ఘనంగా పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *