ఘనంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు
ఘనంగా భారతరత్న డాక్టర్ బిఆర్
అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు

రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించిన
డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్
బోడుప్పల్, ఏప్రిల్ 15 (విశ్వం న్యూస్) : నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ 132వ జయంతి సందర్బంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్ల 2వ డివిజన్ అంబేద్కర్ నగర్ (పిట్టలబస్తి) కాలనీ వాసులు యువకుల ఆధ్వర్యంలో డాక్టర్.బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవిగౌడ్ హాజరై డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు అంబేద్కర్ నగర్ (పిట్టలబస్తి) కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
