నాటు సారా విక్రయిస్తే జైలు తప్పదు
నాటు సారా విక్రయిస్తే జైలు తప్పదు

ఎక్సైజ్ సి.ఐ అక్బర్ హుస్సేన్
జమ్మికుంట, మే 3 (విశ్వం న్యూస్) : నాటుసారా విక్రయించే వారిపై కేసులు నమోదు చేస్తాం, అని జమ్మికుంట ఎక్సైజ్ సి.ఐ ఎండి అక్బర్ హుస్సేన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జమ్మికుంట పట్టణంలో కోరపల్లి రోడ్డులో తాళ్లపల్లి భాగ్యలక్ష్మి నాటు సారా విక్రయిస్తుండగా ఎక్షైజ్ పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.
పాత మున్సిపల్ ఆఫీస్ ఏరియాలో నివాసి ఐన తాళ్ళపల్లి భాగ్యలక్ష్మి శంకరపట్నం మండలం మెట్టుపల్లీ గ్రామం నుండి గత కొంత కాలంగా నాటు సారాను తీసుకువచ్చి జమ్మికుంటలో అమ్ముతున్నట్లు సమాచారం ఉండటం వలన, నిఘాతో తనిఖీలు చేస్తుండగా మంగళవారం భాగ్యలక్ష్మి ఇంట్లో రెండు లీటర్ ల నాటు సారాయి పాకెట్స్ దొరికినట్లు సి.ఐ తెలిపారు.
నాటు సారాను తయారు చేయడం, విక్రయించడం, సరఫరా చేయడం అనేది చట్ట రీత్యా నేరమని అందుకు అవసరం ఐతే పి.డి యాక్ట్ కేసు నమోదు చేసే అవకాశం ఉందని మరియు జరిమానా లక్ష రూపాయల వరకు ఉంటుందని అన్నారు. ఈ తనఖి కార్యక్రమంలో ఎస్. ఐ కబీర్ దాస్, హెడ్ కానిస్టేబుల్ ఐలయ్య, మహిళా కానిస్టేబుల్స్ శైలజ, మౌనిక పాల్గొన్నారు.
