ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి బైఠాయింపు

పెద్దపల్లి, మే 2 (విశ్వం న్యూస్) : పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించింది. ఆమె కథనం ప్రకారం పెద్దపల్లి మండలం హనుమంతుని పేట గ్రామానికి చెందిన, రాజ్ కుమార్, ప్రియాంక లు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకొమ్మని ఒత్తిడి చేయడంతో రాజ్ కుమార్ ససేమిరా అనడంతో ప్రియాంక రాజ్ కుమార్ ఇంటి ముందు కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయించింది.

పెళ్లి చేసుకునే అంతవరకు దీక్ష విరమించేది లేదని తేల్చి చెప్పింది. దీంతో స్థానిక సర్పంచ్ చొరవ చేసుకొని అబ్బాయి అమ్మాయితో మాట్లాడి, పెళ్లి చేస్తానని మాట ఇవ్వడంతో, దీక్ష విరమించి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిపోవడంతో గొడవ సద్దుమణిగింది.
