కరీంనగర్

కాంగ్రెస్ కు ప్రజల మద్దతు-నాయకుల మధ్య కత్తుల వైరం

  • కాంగ్రెస్ పార్టీ నుండి కసుబోజుల వెంకన్న, సలీం పాషా సస్పెండ్

జమ్మికుంట, మే 3 (విశ్వం న్యూస్) : హుజురాబాద్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీలో 2021 ఉప ఎన్నికల నాటి నుండి ఇప్పటివరకు ఇద్దరు నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం కార్యకర్తలలో అయోమయం అవరిస్తుంది. ఉప ఎన్నికల లో పోటీ చేసి ఓటమి చెందినా కాని బల్మూరి వచ్చే ఎలక్షన్స్ లో టికెట్ గురించి ఆలోచించ కుండా నియోజక వర్గం మొత్తం తిరుగుతూ పార్టీ బలోపేతం, పూర్వ వైభవం దిశగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ తీరిక లేకుండా తపన పడుచున్నాడు.

రేవంత్ రెడ్డి పాదయాత్ర సమయంలో బల్మూరీ వెంకట్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వేములవాడలో జరిగిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మురి వెంకట్ అని మీడియా ముఖంగా వెలిబుచ్చారు. ఉప ఎన్నికల నుండి ఓటమి పాలైన నియోకవర్గస్థాయిలో ప్రతి గ్రామంలో కార్యకర్తను సమన్వయ పరుస్తూ వారి సమస్యలు పరిష్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ వైభవం దిశగా అడుగులు వేస్తూ పార్టీని బలేపేతం చేస్తున్నాడు బల్మురి వెంకట్.

ఇది ఇలా ఉండగా హుజురాబాద్ నియోకవర్గంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు పత్తి కృష్ణారెడ్డి గత ఉప ఎన్నికలలో టికెట్ కోసం ప్రయత్నించి విఫలం చెందాడు. ఉప ఎన్నికలలో సమన్వయలోపం కారణంగా ఇద్దరి మధ్య దూరం ఏర్పడింది అనేది అందరికీ తెలిసిన విషయంమే.

పత్తి కృష్ణారెడ్డి కూడా రానున్న ఎన్నికలలో నియోకవర్గం నుండి తనుకూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అధిష్టానం ఆదేశిస్తే పోటీకి తన ప్రయత్నం చేస్తూనే తనకు అనుకూలంగా నాయకుల చుట్టూ తిరుగుతూ తను పోటీలో ఉన్నాడనే భావనను చాటుకుంటున్నారు. బల్మురి వెంకట్ నియోకవర్గస్థాయిలో కాంగ్రెస్ పార్టీ నీ బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేసే క్రమంలో బల్మురి వెంకట్ కు పత్తి కృష్ణారెడ్డి కి మధ్య సయోధ్య లేకపోవడంతో కార్యకర్తలలో అయోమయం ఏర్పడింది.

బల్మురీ వెంకట్ కు రాష్ట్ర నాయకుల నుండి కేంద్ర నాయకత్వాల ఆశీస్సులతో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల బలం, ప్రజల మద్దతు కూడా ఉన్నాయి.

పత్తి కృష్ణారెడ్డికి మాత్రం పొన్నం ప్రభాకర్, జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు నియోజవర్గంలోని ప్రజల మద్దతు కూడా ఉందని తను ప్రచారం చేసుకుంటూ నియోజవర్గంలో సమస్యలపై కృష్ణారెడ్డి కూడా అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఎలక్షన్స్ సమీపిస్తున్న తరుణంలో అధిష్టానం వీరిద్దరితో చర్చించి ఇద్దరినీ ఒకే తాటిపై తెస్తే నియోకవర్గస్థాయిలో నాయకులకు, కార్యకర్తలకు బరోసా అనేది ఉంటుంది. బల్మురి వెంకట్ మనిషిగా పార్టీ మాజీ పట్టణ అధ్యక్షుడిగా ఉన్న కసుబోజుల వెంకన్నను, సలీం పాషాలను పార్టీ జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ పార్టీ నుండి సస్పెండ్ చేయడం స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతల్లో చర్చనీయాంశం ఐనది. నాయకుల సమన్వయ లోపం ఇంకా ఎన్నాళ్ళు, ఎలక్షన్స్ సమీపిస్తున్న వేళ నాయకుల మధ్య సమన్వయం ఉంటుందా అనేది ప్రశ్నార్థకమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *