వానకాలం రాకముందే మళ్లీ మొదలైన వరదల బెడద
వానకాలం రాకముందే మళ్లీ
మొదలైన వరదల బెడద

బిక్కుబిక్కుమంటున్న సాయి నగర్ కాలనీవాసులు..
పిర్జాదిగూడ , మే 3 (విశ్వం న్యూస్) : పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో వరద ముప్పు ప్రాంత ప్రజలతో కలిసి కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటం ఫలితంగా వరద ముంపును మళ్ళించడానికి ప్రభుత్వం ఎస్ ఎన్ డీ పీ ద్వారా రూ.110 కోట్ల రూపాయలను ఇస్తామని ప్రకటించి, ఈ నిధులను వెంటనే కేటాయించకుండా ఒక సంవత్సరం కాలం పాటు తాత్సారం చేయడం, ఆ తర్వాత నిధులను కేటాయించినా గాని ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన చేయకుండా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, మేయర్ ఇన్నాళ్లు నిమ్మకు నేరెత్తకుండా ఉండి ఆలస్యంగా ఎస్ ఎన్ డీ పీ నిధులతో పనులు చేపట్టడం, ఈ పనులు కూడా నత్త నడకన సాగుతుండటంతో ఈ వరద నీటి ముంపు మళ్లింపు పనులు ఈ కార్పొరేషన్ పదవీకాలం పూర్తి అయ్యేంతవరకు అవకాశం లేదని, నిన్న కురిసిన చిన్నపాటి వర్షానికే పైనుంచి వచ్చిన వరద నీటితో సాయి నగర్ అంతా మునిగిపోయి ప్రజలు భయాందోళనలతో ఉన్నారని, మున్సిపల్ అధికారులకు అధికారి పార్టీ నాయకులకు వసుళ్ళ మీద, కబ్జాల మీద ఉన్న శ్రద్ధ ఈ వరద నీరు మళ్లింపుపై లేదని ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు దానావత్ శ్రీలత బద్రూనాయక్ విమర్శించారు.

ఇప్పటికైనా వానాకాలం రాకముందే వరదనీరు మళ్లింపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, లేనిపక్షంలో ప్రజలతో కలిసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
