మేడారం మహాజాతర-2024 తేదీలు ఫిక్స్!!

మేడారం, మే 3 (విశ్వం న్యూస్) : తెలంగాణ కుంభమేళా గిరిజనుల ఆరాధ్య దైవంగా కొలుస్తున్న సమ్మక్క-సారలమ్మ మేడారం జాతరకు తేదీలను ఖరారు చేశారు. మేడారం జాతర 2024 ఫిబ్రవరి లో 21 నుంచి 24వ తేదీ వరకు జాతర నిర్వహించనున్నట్లు తెలిపారు. సమ్మక్క సారలమ్మ పూజారులు. విగ్రహాలు లేని విశిష్ట జాతరగా గుర్తించబడిన మేడారం జాతర ప్రతి రెండేళ్లకు ఒకసారి చాలా ఘనంగా జరుగుతోంది. వివిధ రాష్ట్రాల నుండి కోట్లాదిగా వచ్చే భక్తులతో మేడారం కుంభ మేళాను తలపిస్తుంది.
- 21.02.2024 బుధవారం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజును గద్దెకు
- 22.02.2024 గురువారం సమ్మక్క దేవతను గద్దెకు
- 23.02.2024 శుక్రవారం భక్తులు మొక్కులు తీర్చుకుంటారు
- 24.02.2024 శనివారం దేవతల వనప్రవేశం
- 28.02.2024 బుధవారం తిరుగువారం జాతర పూజలు ముగింపు


