కరీంనగర్

వేసవి క్రీడ శిక్షణ శిబిరం ప్రారంభం

వేసవి క్రీడ శిక్షణ శిబిరం ప్రారంభం

వీణవంక, మే 3 (విశ్వం న్యూస్) : వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో వాలీబాల్ శిక్షణ శిబిరాన్ని యువజన క్రీడా అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం పాఠశాల గ్రౌండ్ లో ఎస్.ఐ శేఖర్ రెడ్డి ప్రారంభించారు.

అనంతరం ఎస్ ఐ మాట్లాడుతూ ఈ నెల 31 తేది వరకు మల్లారెడ్డిపల్లి పాఠశాల మైదానంలో ఉదయం 06:00 గం, నుండి 08:00 గం, వరకు సాయంత్రం 04:00 గం, నుండి 06:00 గం,, వరకు క్రీడ శిక్షణ కొనసాగుతోందని, మండలంలోని ఆసక్తి కలిగిన 14 సంవత్సరాల లోపు బాలురు, బాలికలు, యువకులు,ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కోరారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి, వాలీబాల్ కోచ్ కర్రె నాని, ఉపసర్పంచ్ బిక్షపతి, పల్లేర్ల కిరణ్, దూలం వెంకటేష్, మోరె మహేష్ వాలీబాల్ క్రీడాకారులు, దూలం సురేష్, గోనెల పెద్దులు,పవన్,కుమార్, వినయ్ తో పాటు,20మంది శిక్షణ క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *