బీరప్ప పట్నాలలో పాల్గొన్న మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్
బీరప్ప పట్నాలలో పాల్గొన్న
మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్

పాల్గొన్న నగర కాంగ్రెస్
అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్ బ్యూరో, మే 3 (విశ్వం న్యూస్) : గత వారం రోజులుగా జరుగుతున్న బీరప్ప పట్నాలు బుధవారంతో ముగిసాయి. రాంనగర్ లోని బీరప్ప దేవాలయంలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరిగాయి. ఉత్సవాలలో పాల్గొన్న మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ అయిదు సంవత్సరాలకొకసారి జరిగే ఈ ఉత్సవాల వల్ల వృత్తిపనివారు గాని వ్యవసాయ దారులు గాని వ్యాపారులు అన్ని రంగాలలో ఉన్న ప్రజలు బీరప్ప ఆశీర్వాదంతో సుభిక్షంగా జీవించాలని కొరుకున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో మేకల నర్సయ్య, స్థానిక కార్పొరేటర్ కచ్చు రవి, కర్రే అనిల్, బీర్ల భీరయ్య, లింగయ్య, బిర్ల నర్సయ్య, పెద్దిగారి ఎల్లయ్య గుండాటీ శ్రీనివాస్ రెడ్డి, కటకం వెంకట రమణ, గ్రానైట్ వ్యాపార వేత్త రాచకొండ తిరుపతి గౌడ్ తది తరులు పాల్గొన్నారు.
