Vishwam Newsకరీంనగర్

కరీంనగర్:ఘనంగా బీరప్ప మాహంకాళి కల్యాణోత్సవాలు

కరీంనగర్:ఘనంగా బీరప్ప
మాహంకాళి కల్యాణోత్సవాలు

హాజరైన రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ బ్యూరో, మే 3 (విశ్వం న్యూస్) : కరీంనగర్ విద్యానగర్ లో గొల్ల, కురుమల కుల దైవం బీరప్ప నాగవెళ్లి కల్యాణో త్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందు లో భాగంగా బుధవారం ఉత్స వాలలో భాగంగా నిర్వహించిన నాగవెల్లి పట్నం కార్యక్రమం లో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన సంస్కృతీ సంప్రదాయాలు ఎంతో గొప్పవన్నారు. మహంకాళి, బీరప్ప,కామరాతి, కల్యాణోత్సవాలను ఘనంగా నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారమన్నారు.

మహంకాళి, బీరప్ప,కామరాతి దేవతల ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కురుమ సంఘం ప్రతినిధులు గొంగడి తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు, బారాస నగర అధ్యక్షులు చల్ల హరి శంకర్, మాజీ కార్పొరేటర్ బీర్ల బీరయ్య, కర్రే పావని, కర్రే అనిల్, తొంటి రాజేందర్ పలువురు నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *