హైదరాబాద్

హర్యానా జానీ వాకర్ మందు పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు

హర్యానా జానీ వాకర్ మందు
పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు

ఎక్సైజ్ సూపర్డెంట్ డి అరుణ్ కుమార్,
సిఐ మల్లయ్య హాజరు
పీర్జాదిగూడ, మే 19 (విశ్వం న్యూస్) : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ కల్తీ మద్యాన్ని అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠా గుట్టును రట్టు చేసిన ఘట్ కేసర్ ఎక్సైజ్ పోలీస్ అధికారులు.ఈమేరకు నారపల్లి లోని ఘట్ కేసర్ ఎక్సైజ్ కార్యాలయంలో వివరాలను వెల్లడించిన మల్కాజిగిరి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ డి.అరుణ్ కుమార్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వసనీయమైన సమాచారం మేరకు మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధి ఏఎస్ రావునగర్ అరుల్ కాలనీ , సెయింట్ జాన్ బాప్టిస్ట్ చర్చి సమీపంలో రూట్ వాచ్ చేస్తుండగా ఒక కారులో హర్యానా నుండి తరలిస్తున్న నలభై అయిదు నాన్ డ్యూటీ పెయిడ్ జానీ వాకర్ రెడ్ లేబుల్ విస్కీ బాటిళ్లను గుర్తించామని అన్నారు.

కారులో ఉన్న ప్రధాన నిందితుడు జంగా లక్ష్మారెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు అల్వాల్ లోతుకుంట లోని అతని నివాసంలో మరో ఎనభై అయిదు జానీ వాకర్ రెడ్ లేబుల్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు .హర్యానా తదితర ప్రాంతాల నుండి ఎటువంటి లేబుల్స్ లేకుండా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ఈవెంట్లకు తక్కువ రేట్లకు అమ్ముతున్నారని తమకు అందిన సమాచారం మేరకు రూట్ వాచ్ నిర్వహంచామని అన్నారు.ఈసందర్భంగా నిందితుడు జంగా లక్ష్మారెడ్డిని అరెస్టు చేసి మూడున్నర లక్షల విలువజేసే నూట ముప్పయ్ జనీ వాకర్ రెడ్ లేబుల్ విస్కీ బాటిల్ లతో పాటు ఒక కారు, ఒక మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కాగా కేసు నమోదు చేసి పరారీలో ఉన్న తాటి శ్రీకాంత్ , నాగరాజు అనే నిందితులను కూడా త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లయ్య పోలీస్ సిబ్బంది అధికారులు తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *