Today TrendingVishwam Newsజాతీయంతాజా వార్తలుతెలంగాణహైదరాబాద్

ఆర్బీఐ సంచలన నిర్ణయం.. రూ.2000 నోట్లను వెనక్కి తీసుకోవాలని బ్యాంకులకు ఆదేశం

  • నోట్లు మార్చుకునేందుకు మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు గడువు

హైదరాబాద్, మే 19 (విశ్వం న్యూస్) : 2000 నోట్లను ఉపసంహరించుకోవాలని రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. సర్కులేషన్​లో ఉన్నవాటన్నింటినీ వెనక్కు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నోట్లు మార్చుకునేందుకు మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. ఇందుకు అన్ని బ్యాంకులు అవకాశం కల్పించాలని సూచించింది. అప్పటివరకు రూ.2000 నోట్లు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. ఇకపై ఎవరికీ రూ.2000 నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులను ఆదేశించింది ఆర్​బీఐ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *