జమ్మికుంట:స్పెషల్ సానిటేషన్ డ్రైవ్ పై దృష్టి సారించండి
జమ్మికుంట:స్పెషల్ సానిటేషన్
డ్రైవ్ పై దృష్టి సారించండి

మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్
జమ్మికుంట, మే 20 (విశ్వం న్యూస్) : మున్సిపల్ పరిధి లోని 30 వార్డులలో పరిశుద్ద సిబ్బంది పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలని కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ప్రత్యేక పారిశుద్ద కార్యక్రమంలో బాగంగా ఈ నెల 19 శుక్రవారం నుండి ఈ నెల 27 వరకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్నినిర్వహిస్తున్నట్టు కమిషనర్ చెప్పారు.
ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా పట్టణ పరిధిలో ని 30 వార్డులలో మురికి కాలువలలో మురికి నీరు ఆగిపోకుండా, డ్రైన్ లోపల చిక్కుకున్న చెత్తను తీసివేయడం, రోడ్లకు ఇరువైపులా శుభ్రం చేయడం, శిథిలావస్థలో ఉన్న ఇండ్ల నుండి ఇండ్ల వ్యర్థాలను తొలగించడం, పబ్లిక్ టాయిలెట్స్ ను శుభ్రపరచడం చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని కమిషనర్ తెలిపారు.
